మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ని ఇటీవల నూతనంగా మండల ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన బర్మావత్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేయడం జరిగింది. ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ మండలాల్లో ప్రజల సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
