మన్యం న్యూస్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలో శుక్రవారం చందా బిక్షపతి, నూతనంగా ఏర్పాటు చేసుకున్న సీతామహాలక్ష్మి ఎరువుల పురుగు మందుల విత్తనాల షాప్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గ్రామాలలో నిత్యం దూర ప్రాంతాలకు వెళ్లి పురుగుమందులు ఎరువులు తెచ్చుకోవడం రైతులకు భారంగా ఉందని అందుబాటులో సీతామహాలక్ష్మి ఎరువుల పురుగుమందుల దుకాణం అందుబాటులోకి రావడం చాలా సంతోషమని ఆయన అన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అమ్ముతూ వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో. స్థానిక సర్పంచ్ ఆరెం సాంబ, పాయం నరసింహారావు, ఎంపీపీ రేగా కాళిక, బూర్గంపాడు మార్కెటింగ్ వైస్ చైర్మన్, కొమరం రాంబాబు, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ సంజీవరెడ్డి మండల బిఆర్ఎస్ నాయకులు భూపతయ్యా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
