మన్యం న్యూస్ మణుగూరు టౌన్:05
మణుగూరు మండలంలో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు పలు శుభకార్యాలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మణుగూరు లోనీ శివలింగాపురం సాయిరాం ఫంక్షన్ హాల్ నందు జరిగిన బోశెట్టి వారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం రైల్వే స్టేషన్ ఏరియా నందు గుగులోతు రమేష్,సంధ్య దంపతుల కుమార్తె సింధు నాయక్ ఓణీల అలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని విప్ రేగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు.మండలం పగిడేరు గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మండల నాయకులు గువ్వా రాంబాబు మనవరాలు గ్రీష్మిక చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,సీనియర్ నాయకులు తాళ్లపల్లి. యాదగిరి గౌడ్,వట్టం. రాంబాబు,యూసుఫ్ షరీఫ్, భద్రాద్రి జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అన్వర్ పాషా,యువజన నాయకులు బోశెట్టి రవి ప్రసాద్,పద్దం. శ్రీనివాస్,గుర్రం సృజన్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.