మన్యం న్యూస్, మంగపేట.
మంగళవారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఎక్కటి సరోజని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి ప్రభంజనం సృష్టించారని. ఎక్కటి సరోజిని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య అన్నారు. ద్వితీయ సవంత్సరం ఫలితాల్లో కళాశాల విద్యార్థులు 134 హాజరవగా 124 మంది ఉతీర్ణత పొంది 93% ఉతీర్ణత సాధించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, ప్రిన్సిపాల్ నిరంతర పర్యవేక్షణ మూలంగానే ఇంత గొప్ప ఫలితాలు సాకారమయ్యాయని ప్రిన్సిపాల్ అన్నారు. మంచి మార్కులు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య, అధ్యాపక బృందం అభినందించి మెమోంటోలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై.రేణుకాదేవి,జె.జ్యోతిర్మయి, ఎం.సంతోష్ కుమార్,ఎం లక్ష్మణ,పి.అనిల్ కుమార్,బి.శ్రీనివాస్,జె.రవీందర్ నాయక్, ఎం.చిరంజీవి పాల్గొన్నారు.
