మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం మల్లూర్ శ్రీ హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో భక్తులకు మాల్యాద్రి గ్రూప్స్ అయినా కామిరెడ్డి రామకొండ రెడ్డి -వెంకట్ రెడ్డి వారి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్లను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ. పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లూర్ దేవస్థాన చైర్మన్ నుతిలకంటి ముకుందాం, ఆలయ ఈఓ సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య, ముగల రమేష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి మండల యూత్ నాయకులు, జానపట్ల విష్ణు, రవికిరణ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.