మన్యం న్యూస్,ఇల్లందు… స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు పట్టణ కేంద్రంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి ఇల్లందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణ, మండల నాయకులు మహానాడుకు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని చాటిన మహనీయులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన పేదల పక్షపాతి ఎన్టీఆర్ అని, ఈ సందర్భంగా ఎన్టీఆర్ అనేది పేరు కాదని ఒక ప్రభంజనం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్ తివారి, కారు నర్సన్న, చాందావత్ రమేష్ బాబు, మాటేలా రత్నాకార్, ముత్యాల రమేష్, వేమూరి సల్మాన్ రాజ్, పెట్యాల శ్రీను, జానీ, కంది రవి, సింగు రమేష్, గోపాల్ రావు, జబర్ తదితరులు పాల్గొన్నారు.