మన్యం న్యూస్ చండ్రుగొండ, మే9: రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం మద్దుకూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, తేమశాతం పరిశీలించారు .తేమశాతం పరిశీలించి రైతుల ధాన్యాన్ని వెంటనే కాటలు వేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, తడిసిన ధాన్యం సైతం వెంటనే కాటాలు వేయాలన్నారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకురావలన్నారు. మిల్లర్ల సమస్యను తాను స్వయంగా చూసుకుంటానన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శంచి , దాన్యం కాటాలు అయ్యేలా చూడాలన్నారు. అలసత్వం వహించొద్దన్నారు. ఆయన వెంట జిల్లా సహకారశాఖ అధికారి డి.వెంకటేశ్వరరావు, అడిషినల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వర్సా రవికుమార్ , ఏఈఓ విజయ్,గుంపెన సొసైటీ వైస్ చెర్మన్ నల్లమోతు వెంకటనారాయణ,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, సొసైటీ కార్యదర్శి సున్నం వెంకటేశ్వర్లు, తదితరులు, పాల్గొన్నారు.