రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
సుజాతనగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రైతుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అగ్రభాగంలో ఉందని తెలంగాణ రాష్ట్రంలో నే కెసిఆర్ నాయకత్వంలో రైతులు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారని అన్నారు. రాష్ట్ర, జిల్లాలో కొత్తగూడెం సొసైటీ అగ్రభాగంలో ఉన్నదని మధ్యకాలంలో కొత్తగూడెం కొత్తగూడెం సొసైటీకి జిల్లాలో ఉత్తమ సొసైటీగా ఎన్నిక కావడం పట్ల సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు ని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, తహసిల్దార్ సునీల్ ఎంపీడీవోవెంకటలక్ష్మి, ఏవోనర్మద పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీలు ముడ్ గణేష్ పెద్ద మల్ల శోభారాణి బత్తుల మానస కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు బండి అమృత రావు గూగులోతు చందర్ నాయక్ తిట్ల విజయ్ కుమారి బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దమల్ల నరేందర్ భూక్యా శోభన్ గాజుల సీతారామయ్య బైరు సాంబయ్య చెరుకూరి వెంకటేశ్వరరావు ( కొండ) మండే శ్రీనివాసరావు , రవి కుమార్ సొసైటీ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు