మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ నిన్న అనగా సోమవారము జరిగిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ జంగ్ సైరన్ సభ ఎంతో విజయవంతమైంది అన్నారు .తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంకై ప్రియాంకా గాంధీ యువతకు బాసటగా యూత్ డిక్లరేషన్ ను ప్రకటించి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థి నిరుద్యోగ యువతకు చేసే మేలును వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి యువత,విద్యార్థి,నిరుద్యోగ యువత,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ఉద్యోగ నిరుద్యోగ సంఘాలు,భారీగా పాల్గొని సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూత్ డిక్లరేషన్ లో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ 18సం” పైబడి చదవుకొనే ప్రతి యువతికి ఏలక్ట్రికల్ స్కూటర్లు అందచేస్తారునీ, ఫీజ్ రియంబర్స్ మెంట్ మెరుగైన విద్య బాసరలో రాజీవ్ గాంధీ ఐఐఐటి తరహాలో 4 నూతన ఐఐఐటి లను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు,అమరవీరులకు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు ఉద్యమములో పాల్గొన్న యువతపై కేసులు ఎత్తివేయడంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులగా ప్రభుత్వ గుర్తింపు కార్డ్ అందజేత,నిరుద్యోగ నిర్మూలన కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజడ్ అన్ లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ నీ ఏర్పాటు చేసి 7 జొన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్జులన్ ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు .ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రవేట్ కంపెనీ లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన ఇల అనేకం యువత కోసం తెలిపారని రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమములో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,లక్ష్మీదేవిపల్లి మండలం యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,సీనియర్ నాయకులు సుబ్బా రెడ్డి,లీగల్ సెల్ నియోజకవర్గ నాయకులు అరకల కరుణాకర్,కాంగ్రెస్ నాయకులునాగేశ్వరావు,కోలిపాకసత్యనారాయణ,చారి,ఫైజుద్దిన్,భూక్యా శ్రీనివాస్,శనగలక్ష్మణ్,పవన్,వెలెటి వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.