- జిల్లా కలెక్టర్ తో రేగా భేటీ
- మణుగూరు మున్సిపాలిటీకి నయారూపు
- అభివృద్ధికి కొత్త ఊపు
కొత్తగూడెం :
అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు, ఈ సందర్భంగా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 5 కోట్ల 50 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ మ్యాప్ ను పరిశీలించారు, అదేవిధంగా జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే చొరవ ను ఈ సందర్భంగా కలెక్టర్ హర్షించారు.