మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బొజ్జాయిగూడెం ఎస్సార్ గార్డెన్స్ నందు 9వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందని ఇల్లందు మండల అధ్యక్షులు శీలం రమేష్ తెలిపారు. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇల్లందు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన విభాగం వారు సకాలంలో పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఇల్లందు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శీలం రమేష్ బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.