మన్యం న్యూస్ వాజేడు.
కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి చీరతో ఇంటి పై కప్పు గొట్టానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండల పరిధిలోని పేరూరు గ్రామపంచాయతీ చిన్న గొల్లగూడెంలో జరిగింది. పేరూరు ఎస్సై రుద్రారపు హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న గొల్లగూడెంకు చెందిన పెళ్లకూరి సత్యనారాయణ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య పిల్లలను కొడుతూ ప్రతి రోజు గొడవ పడుతూ ఉండేవాడు. పెళ్లకూరి సత్యనారాయణ తండ్రి వెంకటరమనయ్య, (27) సం,, కులం: మాల, వృత్తి: తాపీ మేస్త్రి గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య పిల్లలను కొడుతూ, ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఉదయం త్రాగిన మైకంలో భార్యతో, అన్నతమ్ముళ్లతో గొడవపడి మధ్యాహ్నం సుమారు 12:30: ఉరి వేసుకొని చనిపోయినాడని తెలిపారు. మృతుని తమ్ముడు పెళ్లకూరి సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరీష్ తెలిపారు.