మన్యం న్యూస్ మనుగూరు టౌన్: మే 8
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధి లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ముస్లిం ఉద్యోగుల ఆధ్వర్యంలో బిటిపిఎస్ ఆవరణలో ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బి. బిచ్చన్న హాజరయ్యారు.ఈ సందర్భంగా సిఈ బిచ్చాన్న మాట్లాడుతూ,మానవ సంబంధాలలో సహోదరత్వం, మనిషిని,మనిషి గౌరవించుకునే విలువలు, ద్వేషరహిత సమాజం, విధ్వంసరహిత ప్రగతి గురించి వివరించడం జరిగింది.పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వలన ఆరోగ్యంతో పాటు దైవభక్తి కూడా పెరుగుతుందన్నారు.కులాలకు,మతాలకు అతీతంగా మానవులందరూ,సమానమేనని పవిత్ర ఖురాన్ గ్రంథం బోధిస్తుందని వారు పేర్కొన్నారు.అనంతరం ముస్లిం ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న కు కురాన్ గ్రంథం బహుకరించి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సయ్యద్ అల్తాఫ్ ఉన్నిసా,ఎండి అక్బర్ హుస్సేన్,సాదిక్ పాషా,ఆరిఫ్ అహ్మద్ జానీ,బేగం సాజిద్ రామ్,సాబ్,సలీం,రియాజ్ అలీ,నజీర్ అలీ,తాజుద్దీన్, షమీనా బేగం,అన్ని విభాగాల ఇంజనీర్లు,యూనియన్ అసోసియేషన్ కార్యదర్శులు, అకౌంట్స్,సిబ్బంది,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.