- మణుగూరు పట్టణ అభివృద్దే లక్ష్యం
- అవిశ్రాంత శ్రామికుడు అభివృద్ధి మాంత్రికుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
- అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 08
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని సురక్ష బస్టాండ్ ఏరియాలో సుమారు 37 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో జరుగుతున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను,పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ డ్రైనేజీ పనులు పూర్తయితే ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది అన్నారు.పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లు లు,డ్రైనేజీలు వంటి నిర్మాణాలు చేపట్టి,అభివృద్ధి పరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని విప్ రేగా తెలిపారు.మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అన్నారు.పట్టణాన్ని మరింత సుందరంగా,అన్ని హంగులు, సౌకర్యాలతో మణుగూరు పట్టణంను తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.మణుగూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,ఏఈ నాగేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ కు. నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, సీనియర్ నాయకులు వట్టం. రాంబాబు,యాదగిరి గౌడ్,పార్టీ నాయకులు ఎడ్ల శ్రీను,తాత రమణ,లక్ష్మయ్య,గణేష్, యువజన నాయకులు, రవి ప్రసాద్ సృజన్ రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.