మన్యం న్యూస్.ములకలపల్లి.మే 08.మండల కేంద్రం లో గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రక్కన నూతనంగా సబ్ పోస్టాఫీసు బి.రవికుమార్ తో కలిసి ములకలపల్లి మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి ప్రారంభించారు. ఈ సందర్బంగా బత్తుల అంజి మాట్లాడుతూ మండలానికి సబ్ పోస్టాఫీసు సేవలు సంతోషకరమని,అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్యాంకింగ్ సదుపాయం ఉన్నందున్న మండల ప్రజలు ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమం లో సర్పంచ్ బి.భద్రం,ఉప సర్పంచ్ శనగపాటి. అంజి, స్థానిక ప్రజా ప్రతినిధులు శనగపాటి సీతారాములు, శనగపాటి. రవి,మిర్యాల.అవినాష్ పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
