మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 09: అశ్వారావుపేటలో ఐకెపి, విఓఏ ల సమ్మె మంగళవారం 23వ రోజుకు చేరింది. సమస్యల పరిష్కారం కోసం పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరవదిక సమ్మె చేస్తున్న వారికి సీఐటీయూ నాయకులు సంఘీభావంగా సమ్మెలో పాల్గొని ఐకెపి విఓఏలు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని 40డిగ్రీల ఎర్రటెండలో స్థానిక మండలంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా ఐకేపీ వీఓఏ మండల అధ్యక్షురాలు షాహినా, జయలక్ష్మి మాట్లాడుతూ ఐకెపి, విఓఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేల ఇవ్వాలని, 10లక్షల సాధారణ భీమా, ఆరోగ్య భీమా కల్పించాలని ఈ ప్రధానమైన సమస్యలను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఉదృతం చేసి ఉద్యమ స్థాయికి తీసుకు వెళతామని హెచ్చరించారు.