మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 9::
మండలంలోని దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి విజయం సాధించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కొండా సాయి తేజ 990/1000 మొదటి ర్యాంకు సాధించగా మండలోజు యువ శ్రీకృష్ణ సాయి 983/1000 రెండో ర్యాంకు సాధించారు సెకండ్ ఇయర్ బైపిసి విభాగంలో కల్లూరు అంజలి 975 మార్కులు మొదటి ర్యాంకు సాధించింది మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ముసలి గంగాభవాని 449/470 మొదటి ర్యాంకు సాధించారు బైపిసి విభాగం నందు శ్రావణి 395/470 సాధించారు. మొత్తం పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సరం 88% విజయం సాధించారు రెండవ సంవత్సరం ఫలితాల్లో 92% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల అధ్యాపక సిబ్బంది కళాశాల బృందం అధికారులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు