UPDATES  

 అంతర్గత ఉద్యోగులు, జూనియర్ అస్సిస్మెంట్ల లకు ఇండక్షన్ టైనింగ్ ప్రోగ్రాం నిర్వాహణ -డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 9

మణుగూరు లోని పైలట్ కాలనీ సింగరేణి కాలరీస్ ఎంవిటిసి శిక్షణ కేంద్రం లో అంతర్గత ఉద్యోగులు,నూతనంగా జూనియర్ అస్సిస్మెంట్ లకు మే 09 నుండి 12 వరకు నాలుగు రోజులు పాటు ఎంవిటిసి వారి ఆధ్వర్యంలో ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తరగతులను నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ మంగళవారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అంతర్గత ఉద్యోగులు,నూతనంగా జూనియర్ అస్సిస్మెంట్ గా నియామకం అయిన వారు అందరికీ అభినందనలు తెలిపారు.సింగరేణిలో బదిలీ వర్కర్ గా నియమించబడి జూనియర్ అస్సిస్మెంట్ గా పదోన్నతి పొందడం ఎంతో సంతోషమని వారు తెలిపారు. మహిళలకు ముఖ్యంగా ఓర్పు, సహనం ఎంతో బాగా ఉంటుంది అన్నారు. అందువలన వారు తమ విధి నిర్వాహణలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని,వారికి ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా సింగరేణి గురించి అవగాహన కలుగుతుందని అన్నారు.క్లరికల్ ఉద్యోగం చాలా భాద్యతాయుతమైనదని తెలియజేశారు.సింగరేణి సహజంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా ప్రక్రియ చేయుడం జరుగుతుందని,అందుకు ఉద్యోగులు,సుపర్వైజర్లు,అధికారులు,అహర్నిశలు శ్రమ పడుతుంటారన్నారు.కానీ క్లరికల్ సిబ్బంది ఉద్యోగులకు రావాల్సిన జీత భత్యాలు, సంక్షేమ కార్యక్రమాలు, పదోన్నతులు,లీవ్ లు,పదవి విరమణ పొందిన ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్, మొదలుగున్నవి త్వరగా చెల్లింపు చేయు విధంగా కృషి చేయాలని కోరినారు.అదే విధంగా కాంట్రాక్టర్లకు, వినియోగదారులకు జరుగు వివిధ చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ మాట్లాడుతూ, సింగరేణిలో గనులు,వివిధ డిపార్ట్మెంట్ల నందు అనేక రకమైన క్లరికల్ విధులు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ముఖ్యంగా సింగరేణి లో అన్నీ కార్యక్రమాలు కంప్యూటీకరన చేయడం జరిగింది అన్నారు.కావున కంప్యూటర్ పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, అలాగే పదోన్నతులు,కాంట్రాక్టు బిల్లులు మొదలగున్నవి సాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. జూనియర్ అస్సిస్టెంట్లు అందరూ పూర్తిగా సాప్ లో నైపుణ్యత సాధించాలని కోరారు.అలాగే తమ దగ్గరకు వచ్చు ఉద్యోగులతో కానీ, మాజీ ఉద్యోగులు కానీ, కాంట్రాక్టర్లకు గాని సహనంతో వారికి సమాధానాలు చెబుతూ,వారి పనులు సత్వరంగ పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,టిబిజికేఎస్ యూనియన్ నాయకులు వి ప్రభాకర్ రావు,విటిసి మేనేజర్ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !