UPDATES  

 ఇంటర్ ఫలితాలలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 9

మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితా లలో అద్భుతమైన ఫలితాలు సాధించారు.మొదటి సంవత్సరంలో 131 మంది విద్యార్థులకు గాను 46 మంది ఉత్తీర్ణత సాధించారు.ద్వితీయ సంవత్సరం 125 మంది విద్యార్థులకు 69 మంది ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఎస్డి.యూసబ్ తెలిపారు.ద్వితీయ సంవత్సరం బైపిసి లో ఏం.లహరి 984/1000, ఎంపీసీలో ఎన్.రీతిగా 969/1000,సిఈసి,హెచ్ఈసి విభాగంలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు అన్నారు.ప్రథమ సంవత్సరం ఎంపీసీలో కే. రవికుమార్,ఏ.మాధురి 470/463 మార్కులు,బైపీసీలో హిందూప్రియ 440/376 మార్కులు సాధించారు అన్నారు.మంచి మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఎస్డి.యూసఫ్ కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !