మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈనెల 11 వ తారీఖున గుండాల ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించనున్నారని ఆ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కోలేటి భవాని శంకర్ గుండాల ఆళ్లపల్లి మండలాల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పాయం నరసింహారావు విజ్ఞప్తి చేశారు. గుండాల మండలంలోని మటన్ లంక వద్ద తొట్టి వాగుపై రెండు కోట్ల 40 లక్షలు, చిన్న వెంకటాపురం వద్ద కిన్నెరసాని పై మూడు కోట్ల 80 లక్షల, చింతలపాడు వద్ద 30 లక్షల రూపాయల, దామర్ తోపు వద్ద హై లెవెల్ వంతెన కోసం కోటి 65 లక్షలు, మర్కోడు ,బట్టుపల్లి మూడు కలవట్లు, సీసీ రోడ్ల కోసం మూడు కోట్ల 50 లక్షలు, చంద్రాపురం వద్ద జల్లేరు వాగుపై నాలుగు నిధులతో ప్రారంభమయ్యే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఉమ్మడి మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు .
