మన్యం న్యూస్, బూర్గంపాడు :
బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి సేవలకు గాను చిన్న వయసులోని శ్రమ శక్తి అవార్డు రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సారపాక పట్టణంలోని తాళ్ల గోమ్మూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద సేవలను గుర్తించి చిన్న వయసులోని శ్రమ శక్తి అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. మంగళవారం బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి ఇటీవల కార్మిక శాఖ తరపున ప్రతిష్టమైన శ్రమశక్తి అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రమ శక్తి అవార్డు గ్రహీత సానికొమ్ము శంకర్ రెడ్డికి జిల్లా పార్టీ తరపున, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. ఆయన సేవలను గుర్తించి శ్రమ శక్తి అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. యూనియన్ అభివృద్ధి తో పాటుగా, పార్టీ అభివృద్ధిలో కార్మికులకు సేవా చేసి, వారి సమస్యల కొరకు నిరంతర పోరాటం చేసినందుకు వారికీ ఈ అవార్డు రావటం జరిగినదని ఆయన అన్నారు. పూర్తిస్థాయిలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన వారు కష్టాల్లో తోడుగా ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈసారి జరిగే ఐటీసీ ఎన్నికలలో బి.ఆర్.టి.యు గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీ, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల కొట్టి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
