UPDATES  

 ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలోభద్రాద్రి జిల్లాకు ఆరవ స్థానం హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో భద్రాద్రి జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం సాధించుట పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఫలితాలు ప్రకటించిన సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి సులోచనా రాణిని ఫలితాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2899 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 1958 మంది, 4085 మంది బాలికలు హాజరు కాగా 3145 మంది మొత్తం 6984 మంది పరీక్షలకు హాజరు కాగా 5103 మంది ఉత్తీర్ణతతో 73 శాతంతో రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 12 వ స్థానం సాధించినట్లు చెప్పారు. మొదటి సంవత్సరంలో 3571 మంది బాలురు హాజరు కాగా 1868 మంది, 4438 మంది బాలికలకు 2997 మంది ఉత్తీర్ణత తో 60 శాతం సాధించి 12 వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం వృత్తి విద్యా కోర్సులో 1118 మంది బాలురు హాజరు కాగా 493 మంది, 1245 మంది హాజరు కాగా 871 మంది మొత్తం 2363 మంది విద్యార్థులు హాజరు కాగా 1364 మంది ఉత్తీర్ణతతో 9 వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. వృత్తి విద్యా కోర్సు 2వ సంవత్సరంలో 840 మంది బాలురకు 557 మంది, 1103 మంది బాలికలకు 927 మంది మొత్తం 1943 మంది విద్యార్థులు హాజరు కాగా 1484 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానం సాధించినట్లు చెప్పారు. 2వ సంవత్సరం ప్రైవేట్ ఫలితాల్లో 257 మంది బాలురు, 91 మంది బాలికలు మొత్తం 348 హాజరు కాగా 114 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6 వ స్థానం సాధించినట్లు చెప్పారు. 2వ సంవత్సరం వృత్తి విద్యా ప్రైవేట్ ఫలితాల్లో 36 మంది బాలురు, నలుగురు బాలికలు మొత్తం 40 మంది హాజరు కాగా 24 మంది ఉత్తీర్ణతతో రాష్ర్టంలో 5 వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు.ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, అధ్యాపకులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సంవత్సరంలో మన జిల్లా ప్రధమ స్థానం సాధించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !