మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 09: మండలం పరిదిలోని వినాయకపురం గ్రామం లోని ఫంక్షన్ హాల్ లో 7,00,8190/- విలువ చేసే 70 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతో పాటు ఆడ పడుచులకు చీరలను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం అందజేసారు. 2020-21 లో కళ్యాణ లక్ష్మికి పెట్టుకున్న 21 మందికి కొన్ని కారణాల చేత ఆగిపోగా అవి తెలుసుకొని ఎమ్మెల్యే మెచ్చా ప్రత్యేక చొరవ తీసుకొని వాటిని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఒక వరమని, అశ్వారావుపేట మండలం రూ. 14కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరిగిందని. అశ్వారావుపేట నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ది కి అండగా ఉన్నారని, అభివృద్ధి చూసి ఓర్వలేని కొందరు స్వార్థపరులు మాయ మాటలు చెప్తూ కొంతమంది వస్తుంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మంచిని మనం మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, తహసీల్దార్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.