మన్యం న్యూస్ చండ్రుగొండ, మే09: ఇంటర్ పరీక్షల్లో సెకండియర్ విద్యార్థులు నూరుశాతం, పస్ట్ ఇయర్ విద్యార్ధులు 92శాతం ఉత్తీర్ణత సాధించారని కెజిబివి స్పెషలాఫీషర్ కాంతకుమారి తెలిపారు. మంగళవారం కేజిబివి స్పెషలాఫీషర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కస్తూర్భాగాంధీ బాలికల వసతిగృహం విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారన్నారు. మొదటి సంవత్సర ఫలితాల్లో సీఈసి 84శాతం, ఎంపిహెచ్ డబ్ల్యూ 100శాతం, సెంకండియర్ లో సీఈసీ 100 శాతం, ఎంపిహెచ్ డబ్ల్యూలో 100శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.కేజిబివి ఫలితాలపై మండల విద్యశాఖాధికారి సత్యనారాయణ, తహసీల్దార్ వర్సా రవికుమార్, ఎంపిడిఓ రేవతిలు విధ్యార్థులకు అభినందనలు తెలియజేశారు.