మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అడవులను సంరక్షించుకుంటేనే గిరిజనులకు అభివృద్ధి జరుగుతుందని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కేంద్రంలో ఏర్పాటుచేసిన తుని కాకు సేకరణ దారులకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 43616 మంది లబ్ధిదారులకు రూ.33.59 కోట్లు నికర ఆదాయ చెక్కులను … తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అడవుల సంరక్షణతోనే గిరిజనుల సమగ్ర అభివృద్ధి ముడిపడి ఉన్నదని ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అడవులు ఆదివాసుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నారు. అడవులనే నమ్ముకుని ఉన్న ఆదివాసుల జీవన సంస్కృతులను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తునికాకు సేకరణ చార్జీలతోపాటు రెవెన్యూ నెట్ షేర్ బోనస్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ
అడవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నారని, అడవుల సంరక్షణ కోసం , సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు, త్వరలోనే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలను అందజేస్తామని తెలిపారు, ఏంతో కాలంగా పెండింగ్లో ఉన్న పోటు భూముల సమస్యను పరిష్కరించి సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటారని తెలిపారు, పినపాక నియోజకవర్గం లో మొత్తం 43,616 మంది లబ్ధిదారులకు రూ. 33.59 కోట్ల రూపాయల బోనస్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
