మన్యం న్యూస్, మంగపేట.
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ సిసి ఎక్స్ ములుగు జిల్లా ఏ డబ్ల్యూ డి ప్రాజెక్టు మేనేజర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కి భారత ప్రభుత్వం వ్యక్తిగత సహాయకులు, అటెండర్ లను నియమించింది.సిసి ఎక్స్ యాజమాన్యం ఏ డబ్ల్యు డి ప్రాజెక్టు కింద ఒక సి సి,ఐదుగురు క్షేత్రస్థాయి సిబ్బంది ఎఫ్ సి పోస్టులను మంజూరు చేసి ఉద్యోగులను నియామకం పూర్తి చేసింది. వీరంతా ఇటీవల విధుల్లో చేరారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ తనకు కేటాయించిన సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. తనకు సిబ్బందిని నియమించిన భారత ప్రభుత్వం మరియు సిసిఎక్ష్స్ యాజమాన్యాలకు ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
