మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 10
మణుగూరు మండలం కేంద్రం లో శ్రీ అమూల్య రక్త పరీక్ష కేంద్రం లో ఒక గార్లపాటి సరోజన భర్త అప్పయ్య (లేటు) అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు రక్త హీనత తో బాధ పడుతుంది.సరోజనకు రక్త దానం చేసే దాతలు ఎవరు అయినా ఉంటే రక్తం ఇవ్వండి అని శ్రీ అమూల్య రక్త పరీక్ష కేంద్రం వెంకట్ నుండి విషయం తెలుసుకున్న శ్రీ చైతన్య స్కూల్ మణుగూరు బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయసాయి కృష్ణ ప్రసాద్ వెంటనే స్పందించి గార్లపాటి సరోజనకు రక్తం దానం చేశారు. ఈ సందర్బంగా విజయ సాయికృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నా మాతృ సమానురాలు అయిన సరోజన కు రక్తం సకాలంలో అందించినందుకు ఆనందం గా ఉంది,దేవుడు దయవలన ఆవిడ ఆరోగ్యం గా ఉండాలి అని కోరారు.