UPDATES  

 కోవిడ్ బాధిత కుటుంబానికి రూ.15 లక్షల కోవిడ్ ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేసిన జనరల్ మేనేజర్ దుర్గం.రామ చందర్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 10

మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థలో 2015 నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ,ఎంతో నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా,బొల్లేమ్.శ్రీకాంత్ కోవిడ్ బారిన పడి ఆగస్టు 2020లో మరణించడం జరిగింది.బొల్లేమ్ శ్రీకాంత్ కాంట్రాక్ట్ ఉద్యోగి అయినప్పటికి సింగరేణికి తన సేవలు అందించారు అని,సింగరేణి నిబంధనల మేరకు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబానికి సంస్థ తరపున నామినీ అయిన భార్య బొల్లేమ్.నాగమణి కి కోవిడ్ ఎక్స్ గ్రేషియా క్రింద రూ.15 లక్షల రూపాయల చెక్కును బుధవారం నాడు జిఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం.రామ చందర్ చేతుల మీదగా అందజేయుటం జరిగింది.ఈ సందర్భంగా జి ఎం దుర్గం. రామ చందర్,శ్రీమతి బొల్లేమ్ నాగమణి కు మనో ధైర్యం కలిగిస్తూ,సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా చక్కగా విధులు నిర్వర్తించిన కీ.శే బొల్లేమ్ శ్రీకాంత్,కరోన బారిన పడి చనిపోవడం ఎంతో బాధకరం అన్నారు.వారి మరణం కుటుంబంతో పాటు సంస్థకు కూడా తీరని లోటు అని,వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆకాంక్షిస్తూ,సి అండ్ ఎండి ఎస్ శ్రీధర్ ఐఏఎస్ ఆదేశం మేరకు కరోన బారిన పడిన దివంగత కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు యాజమాన్యం ద్వారా ఆర్ధిక తోడ్పాటు గా కోవిడ్ ఎక్స్ గ్రేషియా అందజేయటం జరిగింది అన్నారు.ఇప్పుడు ఇద్దరి పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యత మీ పై ఉంది కాబట్టి సింగరేణి యాజమాన్యం అందిస్తున్న రూ. 15 లక్షలను ఇంటి అవసరాలకు,బిడ్డల భవిష్యతూకు మాత్రమే వినియోగిస్తూ,పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సూచించారు.ఈ కార్యక్రమంలో పీఓ ఎంఎన్ఐఓసి శ్రీనివాస చారి, అధికార ప్రతినిధి డిజిఎం సలగల రమేశ్,టిబిజికెఎస్ యూనియన్ బ్రాంచ్ ఉపాద్యక్షులు వి ప్రభాకర్ రావు,సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్,సెక్యూరిటీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !