*కాలినడకన వచ్చి పల్లెకి ఆర్టీసీ బస్సు తెచ్చి
ఎవ్వరు చేయని రహదారిని పూర్తిచేసిన రేగా
కొమరారం నుంచి చెట్టు పల్లి రహదారిని పనులు పూర్తి
మన్యం న్యూస్ గుండాల: గతంలో కాలినడకన వచ్చిన రహదారి గుండానే గురువారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. 2018 ఎన్నికల కు ముందు కొమరారం నుండి చెట్టుపళ్లి ద్విచక్ర వాహనాలపై వెళ్లే క్రమంలో ద్విచక్ర వాహనాలు సైతం ఎక్కలేకుండా ఉన్న రహదారిని కాలినడక నడుచుకుంటూ చెట్టుపల్లి గ్రామానికి అతి కష్టం మీద చేరుకున్నారు ఆనాడే దృడ సంకల్పంతో రహదారిని పూర్తిచేయాలని భావించిన రేగా తాను అనుకున్నది సాధించారు కోట్ల రూపాయల నిధులను కేటాయించి కొమరారం, చెట్టుపల్లి రహదారిని పూర్తిచేసి గురువారం అదే రహదారి గుండా ప్రయాణించనున్నారు
