UPDATES  

 అఖిల భారత ఆదివాసి సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.

 

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:-  మే 21న విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్ లో అఖిలభారత ఆదివాసి సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం ఇల్లందు మండలం రామకృష్ణాపురం లో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు చింత నర్సింహా రావు, గొగ్గల రాజు మాట్లాడుతూ  ఆదివాసి ప్రజలపై జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూమిపైన,అడవిపైన, అటవీ సంపదల పైన హక్కును తిరిగి సాధించుకోవటం కొరకు ఆదివాసీలందరూ ఐక్యమవ్వాలని పిలుపునిచ్చారు.  దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి మే 21న విశాఖపట్నంలో జరుగు అఖిలభారత ఆదివాసి సదస్సులో  ఆదివాసి గిరిజనులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో  గొగ్గల చిరంజీవి,  వుకే నరేష్, వుకే సురేష్, వుకే నరేందర్, మల్లేష్, ప్రభాకర్, సంజీ, రామనాథం, చింత రాజేష్, వీరభద్రం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !