మన్యం న్యూస్ గుండాల..గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు, కాచన పల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న సాయం అమ్ములు 9.0 జిపిఏ సాధించింది. గుండాల జిల్లా పరిషత్ పాఠశాలలో38 విద్యార్థులకు 22 మంది పాసయ్యారు, కస్తూరిబా పాఠశాలలో 20 మందికి 14 మంది, గురుకుల పాఠశాలలో 72 మందికి64 మంది మామ కన్ను ఆశ్రమ పాఠశాలలో 18 మందికి 18 మంది, శంభుని గూడెం పాఠశాలలో 25 మందికి 25 మంది, ఆశ్రమ పాఠశాల కాచినపల్లి బాలికలు 51 మందికి 51 మంది ఉత్తీర్ణత సాధించారు. 24 మందికి 21 మంది, ఆళ్లపల్లి 9 మందికి 9 మంది, మర్కోడు 14 మందికి 9 మంది, మర్కోడు ఆశ్రమ పాఠశాల 7 విద్యార్థులకు 7 ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కంటే ఈసారి ఉత్తీర్ణ శాతం రెండు మండలాలలో కొంతమేర తగ్గింది
