మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 10::
భారత రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి పౌరునికి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఇంటింటికి ఉచితంగా పుస్తకాలు అందించాలని ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ప్రజలకు అన్ని హక్కులు కల్పించబడుతున్నాయని ప్రభుత్వాలు అందించే ప్రతి పథకం కేవలం భారత రాజ్యాంగం వలన మాత్రమే అమలు అవుతాయని ఈ వాస్తవం 90% ప్రజలకు తెలియదని దీని కారణం ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేయకపోవడమేనని అన్నారు ఇకనైనా ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందేలా ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సతీష్ మహారాజ్ చంటి రామకృష్ణ తేజ కార్తీక్ కిరణ్ మురళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.