ఆత్మీయ సమ్మేళనానికి రండి..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు* మన్యంన్యూస్,ఇల్లందు:ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆయన నివాసంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మే 12న ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనంకి రావాల్సిందిగా తుమ్మలను ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇల్లందులో జరుగుతున్న అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే హరిప్రియను తుమ్మల అభినందించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం మండలం వైస్ ఎంపీపీ మరియు బయ్యారం మండల అధ్యక్షుడు తాతగణేష్, ఇల్లందు మున్సిపల్ 11వవార్డ్ కౌన్సిలర్ చేరుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
