- వివోలను సేర్పు ఉద్యోగులుగా గుర్తించాలి..
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు,
- వీరయ్య లకు వినతి పత్రం అందజేత..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 10::
వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం 26000/- చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో లక్ష్మీనగరం నుండి ములకపాడు హస్పటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీ దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ మాట్లాడుతూ వివో ఏలు 24 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేస్తూ ప్రజలను ఆర్థికంగా ఎలా మెరుగుపడాలో వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లో ప్రచారం చేస్తూ కష్టపడి పనిచేస్తున్న మాపై ప్రభుత్వం దయసుపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఎ మండల కార్యదర్శి నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు సిఐటియు మండల అధ్యక్షులు చిలకమ్మ ఆదిలక్ష్మి చంద్రకళ మంగ వేణి కృష్ణవేణి అరుణ పద్మ తదితరులు పాల్గొన్నారు