UPDATES  

 సాల్లే చెప్పోచిన్నావ్ తీ అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది…? కాంగ్రెస్ హయామంటూచెప్పుకోవటానికే చరిత్ర..

సాల్లే చెప్పోచిన్నావ్ తీ
అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది…?
కాంగ్రెస్ హయామంటూచెప్పుకోవటానికే చరిత్ర..
అభివృద్ధిలో అర మరకలు.
తెలంగాణ ప్రజలు చూస్తున్నరు.. పినపాక ఎమ్మెల్యే రేగా..
ఎమ్మెల్యే రేగా పోదెం వీరయ్యమధ్య వాగ్వాదం
గిరిజనులకు అడవి ద్వారా ఆదాయం, అటవీ సంరక్షణ మనందరి బాధ్యత..
రూ.27 కోట్ల బీడీ కార్మికుల బోనస్ పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
తునికాకు బోనస్ స్వీకరిస్తున్నాం నా నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు.. ఎమ్మెల్యే పొదెం వీరయ్య
ఆదివాసీలు అడవి బిడ్డలు జూన్ నాటికి పోడు పట్టాలు కూడా పంపిణీ.. రేగ కాంతారావు
భద్రాద్రి జిల్లా అడవి జిల్లా కలెక్టర్ అనుదీప్..

మన్యం న్యూస్ దుమ్మగూడెం ఏప్రిల్ 10:: సాల్లే చెప్పొచ్చినవ్ తీ ..అభివృద్ధి అంటే.. మాదంటూ గొప్పలు చెప్పుకుంటూ గత చరిత్ర గురించి మాట్లాడటం అనవసరం.. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏలిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిలో అరమరకలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. ఆనాడు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులకు కన్ను కొడుతుందని… శ్రీరంగనీతులు అందరూ చెబుతారని.. చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలే గుర్తుంచుకుంటారని ప్రగల్బాని మాని గమ్మున కూర్చోండి అంటూ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య మధ్య జరిగిన వాగ్వివాదం సాక్షాత్తు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తు పోయే విధంగా సభ ప్రాంగణంలో చోటుచేసుకుంది.
అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసులకు అటవీ ఉత్పత్తులతో ఎంతో ఆదాయం చేకూరుతుందని అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని అటవీ, పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రం ములకపాడు గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2016 నుండి 2021 వరకు తునిగాకు సేకరణ బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భద్రాచలం డివిజన్లో విడుదలైనటువంటి 27 కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జిల్లా కలెక్టర్ అనుదీప్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల బీడీ కార్మికుల బోనస్ విడుదల చేయడం జరిగిందని అటవీ ద్వారా ఎంతో ఆదాయం ఉందని అందరూ అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 277 కోట్లు బోనస్ డబ్బులు మంజూరయ్యాయని భద్రాచలం నియోజకవర్గం 27 కోట్లు రూపాయలు బీడీ కార్మికులు లబ్ధి చేకూరుతుందని, తెలంగాణ ప్రభుత్వంలో హరితహారం వంటి కార్యక్రమంతో మొక్కలు పెంచడం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం కూడా 30 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు పక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు. బోనస్ డబ్బులు లబ్ధిదారులు 10 రోజుల్లో చేకూరుతాయని ఎవరు కూడా దళారులు నమ్ముద్దని కోరారు ఈ సంవత్సరం 50 ఆకుల కట్టకు 2.05 రూపాయలు ఉన్నటువంటి రేటును 3 రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. త్వరలోనే ఆదివాసుల గిరిజన కల పోడు భూములు నెరవేరుతుందని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
భద్రాద్రి జిల్లా అడవి జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాది జిల్లా అడవి జిల్లా అని కలెక్టర్ అనుదీప్ అన్నారు 60% అటవీ ప్రాంతం మన జిల్లాలో ఉందని అటవీని సంరక్షించుకొని వచ్చే ఫలాలను పెంపొందించుకోవాలని కోరారు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 35 396 మందికి బోనస్ మంజూరు అయిందని పది రోజుల్లో వారు ఎకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులను అభినందించారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి తునికి ఆకు బోనస్ విడుదల చేయడం సంతోషకరమని దీనికి భద్రాచలం నియోజవర్గ ప్రజానీకానికి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు అలానే ఆదివాసుల ప్రధాన సమస్య అయినటువంటి అటవీ పోడు భూముల పట్టాలు సమస్య కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ ఆదివాసి అంటే అడవి బిడ్డలని అటవీ సంరక్షించుకోవడంలో ఎప్పుడు ముందుంటారని అన్నారు గతంలో ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల మధ్య తీవ్ర సమస్య ఉండేదని దీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు ప్రజలకు కలిసి ఉంటేనే అడవిని సంరక్షించుకునే అవకాశం ఉంటుందని తెలిపారని సూచించారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి కోడి భూములు మంజూరయ్యాయని జూన్ మొదటి వారం లోగా పంపిణీ చేస్తామని మొత్తం డివిజన్ వ్యాప్తంగా 11 పట్టాలు కలెక్టర్ ఆఫీస్ లో సిద్ధంగా ఉన్నాయని అన్నారు వీటితోపాటు అసైన్మెంట్ భూములు కూడా పట్టలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం పోలీస్ వారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ ఐటీడీఏ పీవో గౌతం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ రత్న కళ్యాణి ఎస్పీ వినీత్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫారెస్ట్ అధికారులు డోబ్రియల్ రంజిత్ గోపీనాథ్ భీమ్లా నాయక్ కనకమ్మ తాసిల్దార్ ప్రతాప్ ఎంపీడీవో ముత్యాలరావు జెడ్పిటిసి సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు
సభ మధ్యలో వివాదం నువ్వెంత అని దూషించుకున్న రేగా – పోదెం… సముదాయించిన కలెక్టర్ ఎస్పీ తునికాకు బోనస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తుండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందు ఒకరినొకరు దూషించుకున్నారు ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ గురించి మాట్లాడొద్దని ఎమ్మెల్యే వీరయ్య అడ్డుకున్నారు మా ప్రభుత్వంలో చేసిన కార్యక్రమం గురించి మాట్లాడటం తప్పులేదని రేగా కాంతారావు హెచ్చరించారు ఈ సందర్భంగా ఒకరినొకరు నువ్వు ఎంత నువ్వు ఎంత అని దుర్భాషలాడారు పక్కనే ఉన్న కలెక్టర్ ఎస్పీ గొడవను సముదాయించారు ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు ప్రసంగం ఇస్తుండగా రేగా అభిమానులు కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు జోక్యం చేసుకొని సద్దుమణిగించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !