మన్యం న్యూస్ దుమ్మగూడెం ఏప్రిల్ 10::
రెండు కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ ఐటీడీఏ పిఓ, ఎస్పి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫండ్స్ తో నిర్మిస్తున్నటువంటి క్రీడామైదానం ప్లానింగ్ తప్పుతుందని పనులు వేగవంతం చేయాలని అధికారులపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ మండిపడ్డారు. బుధవారం మండల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక ములకపాడు క్రీడా మైదాన ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే క్రీడామైదానంలో ఐటిడిఏ ఇంజనీర్ అధికారులు స్థలం చేకూరడం లేదని ప్లానింగ్ లో మార్పులు చేసి నిర్మిస్తుండగా గమనించిన ఎస్పీ ఐటిడిఏ అధికారులను ప్లానింగ్ లో మార్పులు ఏం వద్దని 400 మీటర్ల ట్రాక్ తో ఆరు రింగులు ఉండేలా చూసుకోవాలని లేకుంటే కాంట్రాక్టర్ కు పైసలు మంజూరు చేయమని హెచ్చరించారు. సభ స్థలం ట్రాకు ముందు ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ క్రీడ మైదానం జాతీయస్థాయి లెవెల్ లో ఉండాలని తూతూ మంత్రంగా నిర్మిస్తే కుదరదని ప్లానింగ్ చేర్పులు చేసి మైదానాన్ని రెడీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ సిఐ రాజు వర్మ ఎస్సై రవికుమార్, కేశవ, ఇంజనీరింగ్ అధికారులు డి ఈ హరీష్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు