మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 11
మణుగూరు పివి కాలనీ సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్ ను కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ అడిషనల్ సిఎంఓ ఏ.సుజాత తమ అధికారిక పర్యటనలో భాగంగా గురువారం నాడు తనిఖీ చేశరు.ఈ సందర్భంగా అడిషనల్ సిఎంఓ ఏ.సుజాత మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్ ను సందర్శించి క్యాజువాలిటీ, మాటివార్డ్ ని,స్టోర్స్,సెంట్రల్ ఫార్మసీ,క్యాంటిన్,మెడికల్ ఓపీ, ఆపరేషన్ థియేటర్ తో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించడం జరిగింది. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ,వైద్య విభాగంలో పని చేయడం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అన్నారు.కాబట్టి వైద్యులు, వైద్య సిబ్బంది,అన్నీ వేళల ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ, సింగరేణియులకు వారి కుటుంబ సభ్యులకు నిరంతరం నిబద్దతతో కూడిన వైద్య సేవలు అందించాలి అన్నారు.అలాగే ఆసుపత్రిలో అన్నీ రకాల మెడిసిన్స్ ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి అని తెలిపారు.పేషెంట్ లకు ఆసుపత్రి ప్రాంగణం ఆహ్లాదాన్ని పంచేలా పచ్చదనం పరిశుభ్రతకు ఎల్లవేళలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అనంతరం అడిషనల్ సిఎంఓ ఏ.సుజాత మర్యాద పూర్వకంగా ఏరియా జనరల్ మేనేజర్ ను దుర్గం రామచందర్ గారిని కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, డివై.సిఎంఓ మేరీ కుమారి, మెడికల్ సూపరింటెండెంట్ టి.శేషగిరి,సర్జెన్,గైనకాలజిస్ట్,ఇతర డాక్టర్లు,సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.