ఆపదలో ఆదుకుంటా అధైర్య పడొద్దు ప్రభుత్వ విప్ రేగా*
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ గుండాల: ఆపదలో ఆదుకుంటా అధైర్య పడొద్దు అంటూ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండల ప్రజలకు భరోసానిచ్చారు. గురువారం మండలంలో పర్యటించిన రేగా శెట్టిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి మంజూరైన సీఎం సహాయ నిధి 28 వేల రూపాయల చెక్ రేగా కాంతారావు గారు లబ్ధిదారుడికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ గారు అని అన్నారు, ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని అన్నారు. చెమ్మని గూడెం గ్రామంలో కర్నూలు కోల్పోయిన బాలికను సైతం పరామర్శించి వైద్య సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు
