UPDATES  

 విధేయుడు నై ఉంటా.. ప్రజా సంక్షేమములో బాధ్యత భరోసా నాదే

విధేయుడు నై ఉంటా..
ప్రజా సంక్షేమములో బాధ్యత భరోసా నాదే
అభివృద్ధిలో నవ శకం మొదలు
మాటలతో కాదు పనులతోనే సమాధానం ప్రభుత్వ విప్ రేగా

మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలను చేశారు. రేగా కాంతారావు విస్తృతంగా రెండు మండలాలలో పర్యటించి తాను నిధులు తెచ్చి పూర్తి చేసిన రహదారులను ప్రారంభించారు.
పోసారం గ్రామం నుండి చెట్టుపల్లి వరకు 6 కోట్ల 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.రోడ్డు నుండి మటమ్ లంక రహదారిపై తొట్టి వాగుపై సుమారు 2 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన నిర్మాణ కోసం పనులకు శంకుస్థాపన చేశారు.
చిన్న వెంకటాపురం గ్రామం నుండి మల్లెల గుంపు రహదారిపై కిన్నెరసాని వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం సుమారు 3 కోట్ల 80 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న వంతెనకు భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. గుండాల నుండివీరాపురం వెళ్లే మార్గంలో వెంకటాపురం గ్రామ సమీపంలో సుమారు కోటి 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన లెవెల్ వంతెన ను ప్రారంభోత్సవం చేశారు.కొడవటంచ నుండి నడిమి గూడెం వయా పాల గూడెం నాగారం వరకు సుమారు 5 కోట్ల 72 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.లింగగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాడు సమీపంలో లో లెవెల్ కల్వర్టు కొరకు 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి పూర్తిచేసిన పనులను ప్రారంభించి నూతనంగా ప్రారంభమయ్యే పనులకు శంకుస్థాపనలు చేయడంతో పనులకు నిధులు తేవాలన్న పనులు పూర్తి చేయాలన్న ఒక రేగా కాంతారావు తోనే సాధ్యమవుతుందని ఉమ్మడి మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీరాజ్ సైదులు రెడ్డి, ఏఈ అఖిల్, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు భవాని శంకర్, అన్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, ఎంపీపీ సత్యం, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఉపాధ్యక్షులు వట్టం రవి,బీసీ సెల్ అధ్యక్షులు రమేష్ , కొర్సా లాలయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !