పల్లె వెలుగు బస్సులో పయనమై వచ్చిన ప్రభుత్వ విప్ రేగా
2016లో ఇచ్చిన హామీని నెరవేర్చిన రేగా
6 కోట్ల 35 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం
మన్యం న్యూస్ గుండాల: పల్లె వెలుగు బస్సులో పయనమై వచ్చిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. 2016లో కాలినడకన చెట్టుపల్లి వచ్చిన నాడే శెట్టిపల్లి వాసులకు ఈ రహదారిని మంజూరు చేసి ఆర్టీసీ బస్సులో వస్తారని హామీ ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారు 2018 ఎన్నికలలో గెలుపొందిన తర్వాత చెట్టుపల్లి ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన హామీని నిలబెట్టుకున్నారు మొత్తం 6 కోట్ల 35 లక్షల రూపాయలను మంజూరు చేసి రహదారి పనులను ప్రారంభించి పూర్తి చేయించారు. ఇల్లందు నుండి కొమరారం మీదుగా చెట్టుపల్లి వరకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి చెట్టుపల్లి చేరుకున్నారు మార్గ మధ్యలో ఉన్న పోతురాజు గండి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెట్టుపల్లి చేరుకొని ప్రజలతో కొంతసేపు ముచ్చటించారు. చెట్టుపల్లి వాసుల కల నెరవేర్చారు. ఏండ్ల తరబడి ఎందరో నాయకులు హామీలు ఇచ్చారు తప్ప ఎవ్వరు కూడా రోడ్డు నిర్మాణ పనులలో పురోగతి సాధించలేదు రేగా కాంతారావు ప్రజల మనిషి అనడానికి మండలంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనమని చెట్టుపల్లి వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీరాజ్ సైదులు రెడ్డి, ఏఈ అఖిల్, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు భవాని శంకర్, అన్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, ఎంపీపీ సత్యం, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఉపాధ్యక్షులు వట్టం రవి,బీసీ సెల్ అధ్యక్షులు రమేష్ , కొర్సా లాలయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు
