మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలంలో వర్షంతో కూడిన గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం గాలి దుమారతో కూడిన వర్షం రావడంతో మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. పాత చర్ల వీధిలో చెట్లతోపాటు కరెంటు స్తంభం కూడా విరిగి రోడ్డుకు అడ్డంగా పడటం జరిగింది. ఆ సమయంలో కరెంటు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొన్ని గ్రామాలలో పూరీల్లు, రేకులు ఇల్లు కు గాలి దుమారాకు ఎగిరిపోవటం వల్ల కొంత ఆస్తి నష్టం జరిగింది.
