మన్యం న్యూస్ గుండాల: కళ్యాణ లక్ష్మి ఇచ్చే సత్తా దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉందా అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించి రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచుల పెళ్లి కోసం లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,పథకం నేటి వరకు 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఇచ్చింద అన్నారు అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది పెద్ద మనసు అని అనేక పథకాలు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు
ఆడపిల్ల పెండ్లి అనంతరం కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష 116 రూపాయలు , గర్భిణీలకు అంగన్వాడి ద్వారా పోషకాహారం ప్రభుత్వం ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యంతో పాటు ఉచిత కాన్పు అనంతరం కెసిఆర్ కిట్టు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు మగ బిడ్డ పుడితే రూ.12 వేలు ఆయాబిడ్డలు చదువుకోడానికి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతూ వారికి అన్ని తానే నిలిచింది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు
సీఎం కేసీఆర్ గారి సహాయంతో ఎంతోమంది పేద కుటుంబాలు పెండ్లిల్లు భారం తగ్గిందని తెలిపారు ఆడబిడ్డలు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు,ఎంపీపీ మంజు భార్గవి, ఎమ్మార్వో సాదియా సుల్తానా, ఎంపీడీవో రామారావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
