మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ డా.వినీత్. ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ కొత్తగూడెం సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలకు సరిగా నెంబర్ ప్లేట్లు కనపడకుండా తిరిగే వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు గురువారం సూచించారు.ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కొత్తగూడెం డిఎస్పీ నేతృత్వంలో సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీస్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో డిఎస్పి మాట్లాడుతూ ఆటో డ్రైవరలందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆటోలో ప్రయాణించే వాహనదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.ఆటో డ్రైవర్ల అందరూ ఆటోలకు నంబర్ ప్లేట్లు సరిగా ఉండేలా చూసుకోవాలని,అదేవిధంగా టాప్ నంబర్లు,డ్రైవర్ సీటు వెనుక డ్రైవర్ పేరు,ఫోన్ నంబర్,చిరునామాతో వెనక కూర్చున్న ప్రయాణికులకు కనిపించే విధంగా ఒక బోర్డును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ నియమాలను పాటించని వారికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుందని,పోలీసు వారు సూచించిన నియమాలను పాటించని వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీలలో భాగంగా 541 ఆటోలను తనిఖీ చేసి వారికి రెండు రోజులు సమయాన్ని ఇచ్చి వదిలేయడం జరిగిందని వెల్లడించారు.నంబర్ ప్లేట్లు లేని 53 ద్విచక్ర వాహనాలను సీజ్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.