మన్యం న్యూస్ దుమ్మగూడెం::
తునికాకు కార్మికులకు కళ్ళలలోనే డబ్బులు చెల్లించాలని తునికాకు బోనస్ అన్ని గ్రామాలకి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాపంథా దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తునికాకు కార్మికులకు బోనస్ నగదు అకౌంట్లో వేస్తామని ఫారెస్ట్ అధికారులు కాంట్రాక్టర్లు అమాయక గిరిజల్ని మోసం చేస్తున్నారని పెండింగ్లో ఉన్న బోనస్ అన్ని గ్రామాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు తునికాకు కార్మికులకు కళ్ళలలోనే డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో పక్షాన తునికాకు బోరాలను బయటకు తరలించకుండా అడ్డుకుంటామని అన్నారు తునికాకు కళ్ళేదారులకు జీతాలు పెంచాలని గాలికట్టల పేరుతో కోత పెట్టవద్దని తునికాకు కోసే క్రమంలో కార్మికులకు వడదెబ్బ ఇతర ప్రమాదాలు ఏమైనా జరిగి మరణిస్తే తునికాకు కార్మికుల కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు సుమతి మహేశ్వరి కృష్ణ లక్ష్మి వీరమ్మ స్రవంతి సీతమ్మ నరసింహారావు సీత తదితరులు పాల్గొన్నారు.