మన్యం న్యూస్, దమ్మపేట, మే, 13: దమ్మపేట మండల కేంద్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో బాణాసంచా కాల్చి స్వీట్ పంచి ఆనందంలో సంబరాలు జరుపుకున్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాటి వెంకటేశ్వర్లు మండల కేంద్రంలో ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి తమ సంతోషాన్ని తెలియపరిచారు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం చాలా సంతోషంగా ఉంది అని దేశమంతా కూడా ఇదే పునరావృతం అవుతుందని తెలియజేశారు. ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది అని నిత్యవసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవని ఇలా ప్రతిరోజు పెంచుకుంటూ పోతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకి రైతు బంధు వేసి తూతూ మంత్రంగా రైతులు కన్నీరు తుడుస్తుందని అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తక్షణం ధరణిని రద్దు చేస్తామని 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తామని రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి వెంకట రామారావు, పానుగంటి సత్యం, చిన్నశెట్టి చిట్టిబాబు, గడ్డిపాటి సత్యం,మురహరి రాంబాబు, మారబోయిన హరిబాబు, పసుమర్తి చిన్నబాబు, పందేటి కృష్ణ, పాకనాటి శ్రీను, చిన్నబాబుగట్ల సర్వేశ్వరరావు, పగడాల కృష్ణారావు, చవ్వ పోలయ్య, తాళ్ల శంకర్, రాధాకృష్ణ, గుత్తి వెంకటేశ్వరరావు, ప్రసాద్, సతీష్ మరియు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.