మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ఆలోచన చేసినట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమ్మర్ క్యాంపులకు హాజరవుతున్న విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యాలను సాదించేందుకు అనుభవజ్ఞులై వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు అందించు విదంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటకు వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు విద్యార్థులు సాధన చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి క్రీడలు చాలా ఉపయోగ పడుతున్నాయని ఆయన అన్నారు.. క్రీడలు వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శరీరం కూడా చక్కటి ఆకృతిని సంతరించుకుంటుందని చెప్పారు. వేసవి సెలవల్లో విద్యార్థులు టివిలు, సెల్ ఫోన్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని దాని వల్ల విద్యార్థులు మానసికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, ఆటల్లో నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యాలను అందించేందుకు
వ్యాయామ ఉపాధ్యాయులు ముందుకు రావడం పట్ల ఆయన అభినందించారు. ప్రతి రోజు విద్యార్థులు
వాలీబాల్, కబడ్డీ, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లతో పాటు అథ్లెటిక్స్ లలో నిపుణులైన వ్యాయామ ఉపాద్యాయులు పర్యవేక్షణలో విద్యార్థులు ఆటల్లో శిక్షణ
పొందుతున్నారని చెప్పారు. ఆటల్లో మెళకువలు నేర్చుకువడం వల్ల భవిష్యత్తులో మన జిల్లా నుంచి మంచి క్రీడాకారులు తయారవుతారని తద్వారా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు నిర్వహించనున్న ఈ సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.