వడదెబ్బతోసీనియర్ నాయకులు గమిడి వెంకటేశ్వరరావు మృతి
నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య,మండల నాయకులు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :మే 13
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామంకు చెందిన గమిడి వెంకటేశ్వరరావు (87) శనివారం ఉదయం వడదెబ్బతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య,సిపిఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి సరెడి పుల్లారెడ్డి,సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్ లు వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి సిపిఐ జెండా కప్పి పూలమాలలు వేశారు.గమిడి. వెంకటేశ్వరరావు జోహార్ లంటూ నివాళులర్పించారు.ఈ సందర్భంగా బి.అయోధ్య మాట్లాడుతూ,గతంలో సీపీఐ పార్టీలో చురుకుగా పని చేశారని విశాలాంధ్ర ఏజెంట్ గా,పేపర్ లో పనిచేశారని చాలామంది ఆయనను పేపర్ వెంకటేశ్వర్లు గాని పిలిచేవారని తెలిపారు.ప్రజానాట్యమండలి కళాకారుడిగా,నాటకాలు వేస్తూ కవితలు కూడా రాసేవారని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉద్యమాల్లో పాల్గొనేవారు అన్నారు.వామపక్ష అభ్యుదయం కలిగిన నాయకులు మరణించడం దురదృష్టకరమని వారు ఎక్కడున్న వారికి,ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు.