మన్యంన్యూస్ ఇల్లందురూరల్: బాలాజీ నగర్ గ్రామపంచాయతీలో ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మంజూరు చేసినటువంటి బిటి రోడ్, డ్రైనేజ్ నిర్మాణ సంబంధిత అభివృద్ధి పనులను, ఎమ్మెల్యే హరిప్రియ సూచన మేరకు ఇల్లందు మండల ప్రజాప్రతినిధులు వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్ ఇల్లందు మండల కో ఆప్షన్ ఘాజి బాలాజీ నగర్ ఉప సర్పంచ్ యాకోబ్ వార్డ్ మెంబర్స్ భూక్య కోటేష్ గ్రామ అధ్యక్షుడు మహేష్ బి ఆర్ ఎస్ నాయకులు నారపాక యాకయ్య వంశీ సరోజ పద్మ తదితరులు నూతన నిర్మాణ పనులపై ఆరా తీసి , నాణ్యతతో సకాలంలో పూర్తి చెయ్యాలని గుత్తేదారులకు తెలిపారు.