UPDATES  

 పూసపల్లి ఓపెన్ కాస్టును వ్యతిరేకించండి.

మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు లోని జెకె- 5 ఓసి విస్తరణ పేరుతో పూసపల్లి ఓపెన్ కాస్ట్ తీయడానికి సింగరేణి యాజమాన్యం పూనుకున్నారని దీనిని వ్యతిరేకించాలని, అండర్ గ్రౌండ్ బావుల కోసం పోరాడాలని -సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. సోమవారం ఇల్లందు మండలంలోని రోమ్పేడు క్యాంప్ కొమ్ము గూడెంలో న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శి వెంపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పూసపల్లి ఓపెన్ కాస్టు వ్యతిరేక గ్రూప్ మీటింగ్లో న్యూడెమోక్రసీ నాయకులు యకయ్యా మాట్లాడుతూ. ఓపెన్ కాస్ట్ ల మూలంగా ప్రజలకు తీవ్రమైన నష్టాలున్నాయని పర్యావరణ సమస్య ఏర్పడుతుందని, ప్రజలు వందలాది ఎకరాల భూములు కోల్పోతారని అన్నారు.
ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లందు పట్టణం కనుమరుగు అవుతుందని,ఓపెన్ కాస్ట్ మూలంగా ప్రజలకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉండవని
ఓపెన్ కాస్ట్ చుట్టూరా ఉన్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని ఆవేదన చెందారు.
ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే ఓపెన్ కాస్ట్లను ప్రజలు వ్యతిరేకించాలని అండర్ గ్రౌండ్ బావుల ద్వారా బొగ్గు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని,సింగరేణి సంస్థ ను డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు యల్.చిన్నస్వామి, ధనుంజయ్, సురేష్, కొండ్రు లక్ష్మీనారాయణ, ఎనగంటి నరేష్, కొండ్రు చుక్కమ్మ, కోటమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !