UPDATES  

 ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మెచ్చా సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే మెచ్చా

మన్యం న్యూస్, అశ్వరావుపేట, మే, 15: ఎన్నికల హామీలో మాట ఇచ్చిన సీసీ రోడ్లు పూర్తి చేసి సోమవారం వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా. మండల పరిదిలోని ఉట్లపల్లి గ్రామ పంచాయతీ, గంగారం గ్రామంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 6.5లక్షలు మంజూరు చేసి వేసిన సీసీ రోడ్డునీ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యే మెచ్చా వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. రామన్నగూడెంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 69లక్షలతో పోసిన సీసీ రోడ్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మెచ్చా ప్రారంభించారు. అనంతరం సీఎం కప్ ఆటలపోటీలను ప్రారంభించారు. అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు గ్రామ ప్రజలందరికీ ఎమ్మెల్యే మెచ్చా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గ్రామంలో చెట్టు పై నుంచి కింద పడి నడుము విరిగి ఇంటి వద్దే ఉంటున్నా వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసారు. అలాగే గడచిన ఎన్నికల్లో 90శాతం ఓట్లు ఎమ్మెల్యే మెచ్చాకే వేశారని, ఈ సారి 100శాతం మద్దతు మెచ్చా కే అంటూ తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ రామన్నగూడెం ప్రజల రుణం తీర్చుకొలేనిదని 2018 ఎన్నికల్లో మద్దతుకు వచ్చిన సమయంలో అందరూ ఆయనకి మద్దతు గా నిలిచారని. గెలిచిన తరువాత మొట్ట మొదటి కార్యక్రమం రామన్నగూడెం లో నిర్వహించడం జరిగిందనీ. ఇచ్చిన హామీ మేరకు అన్ని వీధుల్లో సీసీ రోడ్డు పోయడం అలాగే పంచాయతీ భవనం ఏర్పాటు చేయడం, అలాగే అంగనవాడి భవనానికి చుట్టూ ప్రహరీ గోడ కూడా త్వరలో మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, సర్పంచ్ ల సంగం అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !